LIVE: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU IN NARAVARIPALLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2025, 10:29 AM IST
|Updated : Jan 13, 2025, 11:17 AM IST
CM Chandrababu in Naravaripalle: సంక్రాంతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 14వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ దంపతులు, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మరికొందరు బంధువులు శనివారమే వెళ్లారు. వారు ఆదివారం సాయంత్రం స్థానిక శేషాపురం సమీపంలోని శేషాచల లింగేశ్వరస్వామి గుడిని సందర్శించారు. కందులవారిపల్లిలోని వినాయకస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ముందుగా తన సోదరి హైమావతి భర్త కనుమూరి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కాసేపు గడిపాక నారావారిపల్లె చేరుకున్నారు. ఇంటివద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చంద్రబాబు ఈరోజు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసిన అనంతరం రైతులకు బిందుసేద్యం పరికరాలు, మహిళలకు ఇ-ఆటోలు అందించనున్నారు. అనంతరం ఎ.రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీసిటీ సౌజన్యంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానికులకు ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. ప్రస్తుతం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jan 13, 2025, 11:17 AM IST