ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్​కు హాజరైన చంద్రబాబు, లోకేశ్ - ప్రత్యక్ష ప్రసారం - PARENT TEACHER MEETING LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 11:47 AM IST

Updated : Dec 7, 2024, 2:42 PM IST

CM Chandrababu Naidu Attend Parent Teacher Meeting in Bapatla : ప్రైవేట్​ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్‌ - టీచర్‌ మీటింగ్‌ సర్కారీ బడుల‌్లోనూ  జరగబోతోంది. నేడు ఒకేరోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. బాపట్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిందండ్రులతో ముచ్చటిస్తున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగుతోంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000ల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000లకు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్​ పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖ్యమంత్రి, మంత్రి ముచ్చటించి, వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు వింటారు. ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్​ పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు.
Last Updated : Dec 7, 2024, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details