LIVE: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Media Conference
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 8:41 PM IST
|Updated : Sep 7, 2024, 9:15 PM IST
CM Chandrababu Media Conference Live : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూట కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టంచేశారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో విజయవాడలోకి నీళ్లు రావని, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోందని, పంపిణీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు, దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సహాయం అందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుత పిరిస్థితులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Sep 7, 2024, 9:15 PM IST