ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: కొనసాగుతున్న వరద సహాయకచర్యలు - సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM Media Conference Live - CM MEDIA CONFERENCE LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 7:22 PM IST

Updated : Sep 6, 2024, 7:55 PM IST

CM Chandrababu Held Media Conference Live : రాష్ట్రంలో వరద ప్రభావంపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే చేపట్టారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్‌లో సీఎం పరిశీలించారు. బుడమేరు ఏఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొల్లేరులో కలుస్తుందో తెలుసుకున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైందో పర్యవేక్షించారు. బుడమేరు గండ్లు, వాటిని పూడ్చే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని గమనించారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని సైతం గమనించారు. అదేవిధంగా కృష్ణానది సముద్రంలో కలిసే చోటు, లంకగ్రామాలను సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అయితే విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో క్రమంగా వరద పెరుగుతోంది. వరద పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకు వరద తగ్గడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారంతా సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం వరద పెరగడంతో తిరిగి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు వరదలతో అతలాకుతమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు ప్రకటించింది. వీటన్నింటిపై సీఎం చంద్రబాబు మీడియా సమవేశం నిర్వహించారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Sep 6, 2024, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details