ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏపీలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు - CM CBN Talks YouTube Academy - CM CBN TALKS YOUTUBE ACADEMY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 10:59 PM IST

CM Chandrababu has Online Interaction : ప్రపంచస్థాయి టెక్‌ దిగ్గజ సంస్థలను, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (మంగళవారం) ఆయన యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌, గూగుల్‌ ఏపీఏసీ హెడ్‌ సంజయ్‌ గుప్తాలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. వారిద్దరితోనూ ఆన్‌లైన్‌ వేదికగా భేటీ కావడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించేందుకు స్థానిక భాగస్వాముల సహకారంతో ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోయే మీడియా సిటీకి సాంకేతిక సహకారం అందించే అవకాశాలపైనా వారితో చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన దాదాపు రెండు నెలల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details