ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నీతి ఆయోగ్ సమావేశం కోసం దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Delhi Tour - CM CHANDRABABU DELHI TOUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 9:17 PM IST

CM Chandrababu Delhi Tour : నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిల్లీ బయలుదేరి వెళ్లారు. వికసిత్ భారత్ 2047 అజెండాగా శనివారం జరిగే నీతి ఆయోగ్ భేటీ (NITI Aayog Meeting)లో ఏపీ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో సీఎం చెప్పనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ ప్రణాళికలపై నీతి ఆయోగ్ సీఈఓ ఇటీవలే సీఎం చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసందే

NITI Aayog Meeting in Delhi : ప్రాథమిక రంగం పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వెల్లడించనున్నారు. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రణాళికలను వివరించనున్నారు. సేవలరంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాల్ని ప్రస్తావించినున్నారు. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముందు, తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details