How to find out the quality of chicken : చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాదు ఇళ్లలోనూ నాన్ వెజ్ వంటకాల జాబితా పెరుగుతోంది. వారంలో గుడ్లు, చికెన్, చేపలు, మటన్, రొయ్యల వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. మరికొంత మంది వారంలో రెండు రోజులు చికెన్ తెప్పించుకుని విభిన్న రుచుల్లో లాగించేస్తున్నారు. ఒక్కోసారి చికెన్ కర్రీ అనుకున్న రుచిలో వచ్చినా కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రుచిగా ఉండడంలేదని కుటుంబ సభ్యులు నొచ్చుకుంటుంటారు. ఎప్పుడూ ఒకేలా వండినా కొన్ని సార్లు రుచికరంగా ఉండకపోవడానికి వేర్వేరు కారణాలున్నాయి. నూనె రకం, మసాలా దినుసులు, వండుకునే పాత్రలు 10శాతం కారణమైతే 90శాతం చికెన్ క్వాలిటీ రుచిని డిసైడ్ చేస్తుంది. అందుకే చికెన్ క్వాలిటీ ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియదు.
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
పిల్లల్ని చికెన్ తీసుకురమ్మని పంపిస్తే దుకాణాదారుడు ఎలాంటి మాంసం ఇస్తాడో అనుమానంగా ఉంటుంది. కొంత మంది చికెన్ సెంటర్ వాళ్లు మిగిలిపోయిన చికెన్ ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు తాజా మాంసంతో కలిపి విక్రయిస్తుంటారు. అందుకే పిల్లల్ని కాకుండా మాంసం దుకాణాలకు పెద్దలు వెళ్తేనే బాగుంటుంది. అయితే, పెద్దలు సైతం చికెన్ నాణ్యత ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
చికెన్ తాజాగా ఉందా లేక పాడైపోయిందా అనేది కొన్ని విషయాలను పరిశీలించడం ద్వారా తెలుస్తుంది. వంట పూర్తయ్యాక మంచిది కాదని తెలిసినా అప్పటికి చేసేదేమీ ఉండదు. అందుకే చికెన్ షాపు నుంతి తెచ్చుకునే సమయంలోనే పరిశీలించి నిర్ధారించుకోవడం మంచిది. తాజా చికెన్ ముక్కలు చూడడానికి బాగుంటాయి. స్మెల్ కూడా కూడా తాజాదా లేక పాడైపోయిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ముక్కలు గులాబీ రంగులో ఉంటే మంచిదని భావించాలి. అలా కాకుండా నిల్వ చికెన్ అయినట్లయితే కొంచెం పసుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే నిల్వ చికెన్లో ఫంగస్ చేరడం వల్ల రంగు మారడంతో పాటు దుర్వాసన వస్తుంది. ఇక రబ్బర్ లాగా తయారైన చికెన్ తినడం వల్ల అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే.
ఈ రోజుల్లో ప్రతీదీ ఆన్లైన్లో తెప్పించుకోవడం అలవాటైపోయింది. నిత్యవసర సరకులు మొదలుకుని ఫుడ్, వంట సామగ్రి సైతం ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. ధర తక్కువ, నోరూరించే ఆఫర్లు ఆకర్షిస్తుంటాయి. అందుకే మాంసం ఉత్పత్తులు ఆన్లైన్లో కొనకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ప్యాకింగ్, నిల్వ, రవాణా సమయాల్లో ఎక్కడో జరిగే లోపాల వల్ల మాంసం నాణ్యత దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. పాడైన చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ లాంటి ప్రాణాంతక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆన్లైన్లో బుక్ చేస్తున్నట్లయితే
ఒకవేళ మీరు ఆఫర్లు ఉన్నాయని, ధరలు తగ్గించారని ఆన్లైన్లో చికెన్ ఆర్డర్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలను గమనించాలి. ముందుగానే నాణ్యతను చెక్ చేయడం, రేటింగ్, రివ్యూలు పరిశీలించడం తప్పనిసరి. పాడైపోయిన చికెన్ తక్కువ ధరకే అమ్ముతున్న ఎంతో మంది వ్యాపారులు అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యారు. అలాంటి చికెన్ తింటే ఫుడ్ పాయిజన్, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇది దీర్ఘకాలికంగా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది.
- ఆన్లైన్ ఆర్డర్ కాకుండా ఇంటికి సమీపంలోని దుకాణాల్లో చికెన్ కొనడం మంచిది.
- తరచూ వెళ్లే దుకాణాలు, తెలిసిన వ్యాపారులు/షాప్ లో చికెన్ తీసుకోవడం ఉత్తమం.
- చికెన్ ముక్కలు కొట్టే సమయంలో పరిశుభ్రత పైనా దృష్టి సారించడం మరింత మంచిది.
రెస్టారెంట్ స్టైల్లో మేతి చమన్ - చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్
"చిట్టిముత్యాల వెజ్ బిర్యానీ" - బద్దకస్తులైన బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!