ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: మంగళగిరిలో వనమహోత్సవం - పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ - Vana Mahotsavam Program - VANA MAHOTSAVAM PROGRAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 4:24 PM IST

Updated : Aug 30, 2024, 5:49 PM IST

Vana Mahotsavam Program : పచ్చదనం పెంపొందించేందుకు వన మహోత్సవం పేరిట మొక్కలను నాటేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వన మహోత్సవంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్​టీయూ ఆవరణలో వనం మనం పేరిట పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే నరసరావుపేటలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం కారణంగా సభాప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్ని బురదమయమయ్యాయి.సభ కోసం జర్మన్‌ టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ వర్షపు నీరు సభా ప్రాంగణంలోకి చేరింది. సభికుల కోసం వేసిన కుర్చీలు భూమి లోపలికి దిగబడిపోతున్నాయి. అలాగే పార్కింగ్‌ ప్రాంతమంతా బురదమయం కావడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు భావించారు. పరిస్థితిని సీఎం కార్యాలయానికి తెలియజేశారు. దీంతో సభా ప్రాంగణం బురదమయంగా ఉండటంతో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనకు రద్దు చేశారు. దీంతో మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకోపార్క్‌ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 
Last Updated : Aug 30, 2024, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details