ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుంటూరులో వైఎస్సార్​సీపీ నేతల అరాచకం - కారం, కత్తులతో దాడి - Clash Between Two Groups in Guntur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 12:38 PM IST

Clash Between Two Groups in Guntur : గుంటూరు నగరంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. శారద కాలనీ 15వ లైన్​లో నివసించే ముస్లిం యువకుడిపై మరో వర్గానికి చెందిన అమీర్, వైఎస్సార్సీపీ నాయకుడు బోరుగడ్డ అనీల్ అనుచరులతో కలిసి ఆదివారం అర్థరాత్రి దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించినందుకు మహిళలని కూడా చూడకుండా వైఎస్సార్సీపీ నేతలు ఎదురు దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గొడవ సర్ది చెప్పేందుకు వెళ్లిన మత పెద్దల కళ్లలో కారం కొట్టి కత్తులతో, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితులు వాపోయారు.

YSRCP Attacks : దీంతో అవతల వర్గం కూడా ఎదురుదాడికి దిగింది అయినప్పటికి ప్రత్యర్థులను కట్టడి చెయ్యలేకపోయారు. ఈ ఘటనలో గాయపడిన 10 మంది జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్​లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details