ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మరోసారి రెచ్చిపోయిన బాలినేని అనుచరులు- కర్రలతో విచక్షణ రహితంగా దాడులు - Clash between TDP and YCP - CLASH BETWEEN TDP AND YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 10:32 PM IST

Clash Between TDP and YCP Leaders in Prakasam District : ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒంగోలు మండలం వెంగముక్కపాలెంలో పోలింగ్‌ కేంద్రం వద్ద తెలుగుదేశం, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన సమయంలో ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. మాటా మాట పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. కిందపడ్డ వారిని కూడా కొట్టారు. బాలినేని కావ్య కూడా అక్కడున్న ఓ వ్యక్తిమీద చేయిచేసుకుంది. 

ఇరు వర్గాల గొడవలను చూసి అక్కడి ఓటర్ల భయభ్రంతులకు గురయ్యారు. ఐతే అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గొడవ అంత సద్దుమణిగాక  పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విషయం తెలుసుకుని వెంగముక్కపాలెం బయలుదేరిన తెలుగుదేశం నేత దామచర్ల జనార్దన్‌ను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ ఘర్షణ కారణంగా వెంగముక్కపాలెం కేంద్రంలో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. 

ABOUT THE AUTHOR

...view details