టీడీపీ-బీజేపీ వర్గీయుల ఫైట్ - ఎందుకో తెలిస్తే షాక్ - TDP BJP CLASH OVER LIQUOR SHOP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2024, 9:57 PM IST
TDP BJP Clash Over Liquor Shop: వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈనెల 14వ తేదీన లాటరీలో ఓ మద్యం దుకాణం టీడీపీ వర్గానికి చెందిన వారికి రావడంతో, దాన్ని ఇవాళ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న బీజేపీ వర్గీయులు దుకాణం ప్రారంభాన్ని అడ్డుకున్నారు. బీజేపీకి చెందిన మండల నాయకుడు మహిళలందరినీ అక్కడికి పంపించి మద్యం దుకాణాన్ని అడ్డుకునే విధంగా చేశారు.
ఈ సందర్భంలోనే టీడీపీకి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. తోపులాట, ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు కలగజేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అదే సమయంలో స్థానిక బీజేపీకి చెందిన మహిళలందరూ జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో మద్యం దుకాణం పెట్టుకోవాలని, ఇక్కడ అనుమతి లేదని భీష్మించడంతో పాటు పోలీసులకు వినతి పత్రం అందజేశారు. గొడవ పెద్దది అవుతుందని గమనించిన పోలీసులు, టీడీపీకి చెందిన మద్యం దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశారు.