కాంగ్రెస్ VS బీఆర్‌ఎస్ - మేమే అభివృద్ధి చేశామంటూ పంచాయితీకి దిగిన నేతలు - Clash Between BRS and Congress
Published : Sep 30, 2024, 2:54 PM IST
Clash Between BRS and Congress In Hanamkonda : హనుమకొండలోని నయీంనగర్ వంతెన నిర్మాణంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లపర్వం కొనసాగింది. నయీంనగర్ వంతెన వద్దకు ఒక్కసారిగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వంతెనను తామే అభివృద్ధి చేశామంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు. నయీంనగర్ నాలా వంతెన అభివృద్ధి పనులు మేం చేశామంచే మేం చేశామని గొడవకు దిగారు.
కేసీఆర్ పాలనలో తామే అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్ నేతలు నినాదాలు చేస్తే, కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని హస్తం నేతలు పంచాయితీ పెట్టుకున్నారు. ఇరు పార్టీల నేతల నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వంతెన వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అనంతరం బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్, సుందర్ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు.