LIVE : నూతన హైకోర్టు భవనానికి సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన - ప్రత్యక్షప్రసారం - Telangana High Court live - TELANGANA HIGH COURT LIVE
Published : Mar 27, 2024, 6:16 PM IST
|Updated : Mar 27, 2024, 6:36 PM IST
Foundation Stone in High Court Live : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు పాల్గొన్నారు.బుద్వేల్‌లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది. హైకోర్టును కొత్త భవనంలోకి తరలించిన తరువాత పాత హైకోర్టు భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్ కోర్టు అవసరాలకు వినియోగించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2009లో అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో హైకోర్టును తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో బుద్వేల్‌తోపాటు చంచల్‌గూడ సమీపంలోని ప్రింటింగ్ ప్రెస్, సోమాజిగూడ, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో స్థలాల పరిశీలన జరిగింది. అయితే ప్రస్తుతం నిర్ణయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతోపాటు న్యాయమూర్తులకు నివాస సముదాయాన్ని కూడా నిర్మించనున్నారు.
Last Updated : Mar 27, 2024, 6:36 PM IST