తెలంగాణ

telangana

ETV Bharat / videos

సివిల్స్‌లో కరీంనగర్ యువకుడికి 27వ ర్యాంక్ - సక్సెస్ ఫార్ములా ఇదేనంట! - Civils 27 Ranker Success Story - CIVILS 27 RANKER SUCCESS STORY

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 3:45 PM IST

Civils 27 Ranker Sai kiran Interview : జాతీయ స్థాయిలో సివిల్స్‌లో 27వ ర్యాంకు సాధించారు కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్‌. తల్లి బీడీ కార్మికురాలు. తండ్రి అనారోగ్యంతో మరణించడంతో పోషణ భారమంతా ఆమె పైనే పడింది. దాంతో బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. వచ్చిన ఆదాయంతో అటు బతుకు బండిని నడిపిస్తూ ఇటు పిల్లలను చదివించారు. ఆ తల్లి కష్టాలను కళ్లారా చూశాడీ యువకుడు. 

కష్టపడి చదివి ఓ కంపెనీలో ఇంజినీర్‌ ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఇంకెదో సాధించాలనే తపన ఆ యువకుడిలో మొదలైంది. తొలి ప్రయత్నంలో విఫలం కావడంతో ఉద్యోగానికి స్వస్తి పలికి  సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకున్నాడు సాయికిరణ్. కానీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఉన్న ఉద్యోగం వదులుకుంటే ఇబ్బందని బంధువులు చెప్పడంతో అటు ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్‌లో ప్రిపరేషన్ కొనసాగించాడు.  

జీవితంలో సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. వాటన్నింటిని పక్కనపెట్టి లక్ష్యం వైపుగా కృషి చేస్తూ ఉంటే విజయం తప్పక వరిస్తుంది అనడానికి సాయికిరణ్ జీవితమే ఉదాహరణ. ఎంతో మంది పేద, మధ్య తరగతి వారికి ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయిలో సివిల్స్ 27 వ ర్యాంకర్ విజయరహస్యమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.  

ABOUT THE AUTHOR

...view details