ఫ్రీ గ్యాస్ సిలెండర్ల బుకింగ్‌కు భారీ స్పందన - మంత్రి నాదెండ్ల ఏమంటున్నారంటే!
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
Minister Nadendla Manohar on Free Gas Cylinders Scheme : దీపం-2 పథకం కింద పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు సిలిండర్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు సబ్సిడీ సొమ్ముల చెక్కును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. పౌరసరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మొదటి ఉచిత సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు ప్రభుత్వం అందించింది. దీపం పథకం 2.0లో భాగంగా ఇప్పటి వరకూ 4 లక్షలకు పైగా సిలెండర్లను లబ్దిదారులు బుకింగ్ చేసుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందిస్తామని తెలిపారు.