వైసీపీ నేతలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు-సీడీఎఫ్ - ఓటర్ల జాబితా అవకతవకలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 7:44 PM IST
Citizens For Democracy On Voters : అధికార పార్టీ నేతలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా రూప కల్పనలో భాగస్వాములైనందున చాలా అవకతవకలు జరిగాయని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మణరెడ్డి అన్నారు. ఓటు లేని వారు స్థానిక బూత్ లెవల్ అధికారి ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటి నెంబర్ లేకుండానే వందలాది ఓట్లు ఉండటం లాంటి అనేక లోపాలను భారత ఎన్నికల సంఘం సంపూర్ణంగా పరిష్కరించలేక పోయిందన్నారు.
Joint Secretary of Citizens for Democracy Lakshmana Reddy : ఓటర్ల జాబితా విడుదలైన 15 రోజులు వరకు ఓటర్ల జాబితాలో ఓటు లేని వారు కొత్తగా ఓటు కోసం జిల్లా కలెక్టర్ గానీ, స్థానికంగా ఉండే బూతు లెవెల్ ఆఫీసర్‌కు గానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. మీ ఓటు అక్రమంగా తొలగిస్తే ఆయా బాధితులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఓటు హక్కుకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950 సంప్రదించాలన్నారు.