తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫూటుగా తాగి సీఐ కుమారుడి నానా హంగామా - క్యాబ్​ డ్రైవర్​పై దాడి చేసి పోలీసులను తిడుతూ హల్​చల్​ - CI Son Halchal in Hanamkonda - CI SON HALCHAL IN HANAMKONDA

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 12:19 PM IST

CI Son Halchal in Hanamkonda : మద్యంమత్తులో సీఐ కుమారుడు హల్​చల్ చేశాడు. కాజీపేట చౌరస్తా వద్ద ఓ క్యాబ్ డ్రైవర్​ను చేతికి ఉన్న కడియంతో చితకబాదాడు. అనంతరం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న మరో మూడు కార్లపై దాడి చేయడంతో వాహనాల అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో సీఐ కుమారుడితో పాటు మరో ఐదుగురు యువకులపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కాజీపేట స్టేషన్ వద్ద చోటుచేసుకుంది.

రహదారి పక్కన మూత్రం విసర్జించవద్దు అన్న కారణంతో క్యాబ్ డ్రైవర్​ను సీఐ కుమారుడుతో పాటు యువకులు విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్​కు బాధితుడు పరుగులు తీశాడు. గాయపడిన క్యాబ్ డ్రైవర్​ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా మద్యంమత్తులో ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులపై సీఐ కుమారుడు నానా హంగామా చేయడంతో పాటు అసభ్య పదజాలాన్ని వాడారని పోలీసులు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details