కోనసీమలో చిరంజీవి అభిమానుల సంబరాలు - ఫ్లెక్సీకి పాలాభిషేకాలు - ఏపీ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 5:37 PM IST
Chiranjeevi Fans Celebrations in Ambajipeta: ప్రముఖ సినీ నటుడు 'మెగాస్టార్' చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' (Padma Vibhushan Award to Megastar Chiranjeevi) రావడంతో కోనసీమ జిల్లా అంబాజీపేటలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, చిరంజీవి అభిమాన సంఘం సభ్యులు,అభిమానులు సంబరాలు చేసుకున్నారు. 'జై చిరంజీవ' అని నినాదాలు చేసి కేరింతలు కొట్టారు. అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. స్థానిక నాలుగు రహదారుల కూడలిలో చిరంజీవి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ చిరంజీవిని వరించినందుకు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని జై చిరంజీవ అంటూ నినాదాలు చేశారు.
Padma Awards 2024: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ అత్యున్నత పురస్కారం వచ్చింది ఎంపికయ్యారు.