ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డ్రోన్‌తో చిన్నిగణపయ్య నిమజ్జనం - నెట్టింట వీడియో వైరల్ - Ganesh IMMERSION With Help of Drone - GANESH IMMERSION WITH HELP OF DRONE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 1:18 PM IST

Children Immersed Bala Ganapati With Help of Drone : తొమ్మిది రోజుల పాటు మండపాల్లో భక్తుల పూజలందుకున్న గణనాథుడు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేసిన ఫొటోలు, వీడియోలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా డ్రోన్​ సాయంతో నిమజ్జనం చేయడం మనం ఎప్పుడైనా చూశామా! ఇది నిజమే. తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో బాల గణపతిని డ్రోన్‌ సాయంతో నిమజ్జనం చేసిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్థానిక మండపంలో ప్రతిష్టించిన బాల గణేశుడికి నవరాత్రులపాటు చిన్నాపెద్దా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

Kadiyapulanka East Godavari District : గణనాథుడి అంతిమ ఘట్టం రానే వచ్చింది. వినాయకుడి నిమజ్జనం చేద్దామంటే కాల్వలో ప్రవాహం నిండుగా ఉంది. దీంతో పోలీసులు నిమజ్జనానికి చిన్నారులను అనుమతించలేదు. ఈ క్రమంలోనే వారు వినూత్నంగా ఆలోచించారు. డ్రోన్‌ సాయంతో చిన్ని గణపయ్యను నిమజ్జనం చేశారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details