LIVE: రాప్తాడు 'ప్రజాగళం' యాత్రలో చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CBN Election Campaign - CBN ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 12:02 PM IST
|Updated : Mar 28, 2024, 1:05 PM IST
Chandrababu Prajagalam Election Campaign Live: పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు బుధవారం నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచార వేగం పెంచనున్నారు. 'ప్రజాగళం' పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాకా ప్రజాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. బుధవారం పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, రా కదలి రా పేరిట రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు బుధవారం నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించారు. తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో చంద్రబాబు పర్యటన సాగింది. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడులో చంద్రబాబు 'ప్రజాగళం' ఎన్నికల ప్రచారం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Mar 28, 2024, 1:05 PM IST