LIVE: కుప్పం నియోజకవర్గ మహిళలతో చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్ష ప్రసారం - chandrababu kuppam tour - CHANDRABABU KUPPAM TOUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 1:53 PM IST
|Updated : Mar 25, 2024, 2:55 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపోందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు వరుస పర్యటనలు చేయనున్నారు. 27వ తేదీన పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించనున్నారు. 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారంలో పాల్గొననున్నారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి. రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో అధినేత పర్యటించనున్నారు.చంద్రబాబు కుప్పం పర్యటన ఇలా: కుప్పంలోని కొత్తపేట శ్రీకన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుప్పం నియోజకవర్గ మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 25, 2024, 2:55 PM IST