ETV Bharat / state

నాలుగు, ఆరు లైన్లుగా ఆ హైవే - త్వరలోనే టెండర్లు - KATHIPUDI TO ONGOLE NH EXPANSION

తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్‌ వరకు - 229 కి.మీ. డీపీఆర్‌ కోసం కన్సల్టెంట్‌ ఎంపికకు టెండర్లు - త్వరలో మిగిలిన 161 కి.మీ.కు టెండర్లు పిలిచే అవకాశం

National Highway 216 Expansion
National Highway 216 Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 12:44 PM IST

Kathipudi to Ongole NH Expansion : ఏపీలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని నాలుగు, ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్‌ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. దీంతో 390 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును త్వరలో విస్తరించనున్నారు.

భీమవరం బైపాస్‌కు కొత్త ఎలైన్‌మెంట్‌ : దాదాపు మూడు సంవత్సరాలుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయిన ఆకివీడు-దిగమర్రు ఎన్‌హెచ్‌ విస్తరణ, అందులోని భీమవరం బైపాస్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. భీమవరం వద్ద కొత్త ఎలైన్‌మెంట్‌తో బైపాస్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే పామర్రు-ఆకివీడు-దిగమర్రు నేషనల్ హైవే-165 విస్తరణ మంజూరైంది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 కిలోమీటర్ల రెండు వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్‌ వివాదం తలెత్తింది.

భీమవరానికి ఎడమవైపు వెళ్లేలా 18 కిలోమీటర్ల మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను మొదట ఖరారు చేశారు. అయితే కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్‌ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. ఎన్‌హెచ్‌ వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.1000 కోట్లు మంజూరవుతున్నా ఎలైన్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో ఇప్పటివరకు పురోగతి లేకుండా పోయింది.

తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మించేలా ఎలైన్‌మెంట్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో ఆకివీడు నుంచి ఉండి, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్లు నాలుగు వరుసలుగాను, మిగిలిన 3 కిలోమీటర్లు రెండు వరుసలుగా విస్తరిస్తారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్‌ సిద్ధమైతే మోర్త్‌ ఆమోదం తెలిపి, విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఆ రెండు రోడ్ల విస్తరణకు డీపీఆర్‌

  • రాజమహేంద్రవరం-రంపచోడవరం నేషనల్ హైవేపై 23 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతోనే రహదారి ఉంది. దీనిని 10 మీటర్ల వెడల్పు (రెండు వరుసలు)తో విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు.
  • విశాఖపట్నం-రాయ్‌పుర్‌ పాత జాతీయ రహదారిలో భాగంగా సాలూరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు 13 కిలోమీటర్లను 10 మీటర్ల వెడల్పుతో విస్తరణకు డీపీఆర్‌ రూపొందించనున్నారు.

డీజీ పరిశీలనతో విస్తరణపై దృష్టి :

  • కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) సారంగి కొద్ది రోజుల కిందట ఏపీకి వచ్చారు. భీమవరం వెళ్తూ కొంతదూరం కత్తిపూడి-ఒంగోలు నేషనల్ హైవే-216పై ప్రయాణించారు. ఈ సందర్భంగా దీని విస్తరణపై సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో మోర్త్‌ అధికారులు కార్యాచరణ చేపట్టారు.
  • కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 390 కిలోమీటర్లు ఉంది. ఇందులో కత్తిపూడి-కాకినాడ మధ్య 27.5 కిలోమీటర్లు మాత్రమే నాలుగు వరుసలుగా ఉండగా, మిగిలిన జాతీయ రహదారి మొత్తం రెండు వరుసలతోనే ఉంది. తాజాగా నాలుగు వరుసలు ఉన్నచోట్ల ఆరు వరుసలుగాను, రెండు ఉన్నచోట్ల నాలుగు వరుసలుగా విస్తరించాలని భావిస్తున్నారు. దీనికి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) తయారీపై దృష్టిపెట్టారు.
  • మొదట కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్‌ వరకు 229 కిలోమీటర్ల వరకు విస్తరణకు డీపీఆర్‌ తయారీకి సలహాసంస్థ ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 8 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. ఎంపికైన సలహాసంస్థ 18 నెలల్లో డీపీఆర్‌ తయారు చేయాల్సి ఉంటుంది.
  • రెండో దశలో మచిలీపట్నం బైపాస్‌ నుంచి ఒంగోలు వరకు 161 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీ కోసం సలహాసంస్థ ఎంపికకు కొద్ది నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు. 2026 చివరి నాటికి వీటి డీపీఆర్‌లు పూర్తయితే విస్తరణకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati

కొండమోడు రహదారి విస్తరణకు సర్కార్‌ నిర్ణయం- అమరావతి, హైదరాబాద్​ మధ్య మార్గం సుగమం - KONDAMODU ROAD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.