Regional Ring Road Expansion : ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు సమీప జిల్లాల్లో పెను మార్పులకు దారితీయనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలో మీటర్ల నిడివిలో నిర్మిస్తోన్న ఈ రహదారి తెలంగాణ జిల్లాల అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కానున్నట్లు తెలుస్తోంది. ఉత్తర భాగం రహదారి పొడవు 158 కిలోమీటర్లు కాగా, దక్షిణ భాగం 182 కిలోమీటర్లు. సుమారు రూ.17వేల కోట్ల అంచనా వ్యయంతో ముందుగా ఫోర్ వే, ఆ తర్వాత ఆరు వరసల మార్గం (ఎక్స్‌ప్రెస్ వే) నిర్మిస్తున్నారు. గంటకు 15 వేల వాహనాల రాకపోకలకు అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేస్తుండగా ఉత్తర భాగంలో పదికి పైగా ఇంటర్‌ఛేంజ్‌లు రానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ రహదారులు మొత్తం 11 అనుసంధానం అవుతుండగా ఆయా ప్రాంతాల్లో విశాలమైన ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ శివారులోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చు. అదే విధంగా వివిధ జిల్లా కేంద్రాలకు నేరుగా వెళ్లడంతో పాటు అంతర్రాష్ట్ర వాహనాలకు ఎంతో దూరభారం తగ్గనుంది. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, జిల్లాల్లోనూ వ్యాపారరంగం మరింత వృద్ధి సాధిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రింగ్ రోడ్డు పనులపై సర్కార్ ఫోకస్ - భూసేకరణకు రైతులు ససేమిరా
నాలుగు జిల్లాల మీదుగా..
గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా (NHAI) సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా ఈ రహదారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఎన్‌హెచ్ డివిజన్ సూచనలు, సలహాలు కూడా తీసుకుని డీపీఆర్ రూపొందించారు. అందులో ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో పాటు ఎన్‌హెచ్ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలకు ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో టోల్‌ప్లాజా, రెస్ట్‌రూం, సర్వీసు రోడ్డు, బస్‌బే, ట్రక్ బే నిర్మించడంతో వ్యాపార, వాణిజ్య పరంగా కలిసి రానుంది.
గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు 4500 ఎకరాల వరకు సేకరించనున్నట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి మెదక్ జిల్లాలో జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి పట్టణాల మీదుగా వయా కంది వరకు 110 కి.మీ. మేర నిర్మిస్తున్నారు. 44, 161, 163 నంబర్ హైవేలతో రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానం అవుతుంది.
గ్రీన్‌ఫీల్డ్ హైవే - అవస్థలు పడుతున్న రైతులు
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డులో కీలక పరిణామాం- నార్త్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్