16 వేల 676 అడుగుల ఎత్తులో - చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు - Chandrababu Birthday Wishes - CHANDRABABU BIRTHDAY WISHES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:12 PM IST
Chandrababu Birthday Special Wishes From Capital Farmer: తెలుగుదేశం (TDP) పార్టీ అధినేత నారా చంద్రబాబుకు రాజధానిలోని ఉద్ధండరాయునిపాలేనికి చెందిన దళిత ఐకాస నాయకుడు, రైతు పులిచిన్నా వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు (Chandrababu Birthday Celebrations) తెలిపారు. సముద్రమట్టానికి 16 వేల 676 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మార్గ మధ్యలోని నాగర్శంగ్ పర్వతంపై చంద్రబాబు చిత్రపటాన్ని ఎగురవేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొద్ది రోజుల క్రితం అనంతపురానికి చెందిన ఉపేంద్ర అనే పర్వతారోహకుడు ఎవరెస్ట్ ఎక్కేందుకు పులిచిన్న ఆర్థిక సహాయం అందించారు. అదే సమయంలో ఈనెలలో చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఎవరెస్ట్‌పై ఎగురవేయాలని కోరారు. దీంతో పర్వతారోహకుడు ఉపేంద్ర శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, పులిచిన్నా చిత్రపటాన్ని నాగర్శంగ్ పర్వతంపై ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎవరెస్ట్ శిఖరం (Mount Everest) అంత ఎత్తుకు తీసుకెళ్లాలని పులిచిన్నా ఆశాభావం వ్యక్తం చేశారు.