తోడబుట్టిన చెల్లెలి పుట్టుక, కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?: చంద్రబాబు - Chandrababu and Lokesh on CM Jagan - CHANDRABABU AND LOKESH ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 4:42 PM IST
Chandrababu and Lokesh Fire on CM Jagan: తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా, మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం అని దుయ్యబట్టారు. తన సొంత సోదరి కట్టుకున్న చీర గురించి మాట్లాడుతున్న జగన్ విశ్వసనీయతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఒక నిరంకుశుడు పాలిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. లండన్ డోస్ కొరత ఉందని తన అంచనా అంటూ లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాగా పులివెందులలో ఇవాళ సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై విమర్శలు గుప్పించారు. 'వైఎస్సార్ వారసులమంటూ పసుపు చీరలు కట్టుకుని కొందరు వస్తున్నారు. వైఎస్సార్ లెగసీని దెబ్బ తీసినవాళ్లతో చేతులు కలిపిన వీళ్లా ఆ మహానేత వారసులు?' అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు, లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.