అమీన్పూర్లో చైన్ స్నాచింగ్ - సీసీటీవీ దృశ్యాలు వైరల్ - Chain Snatch at rangareddy
Published : Feb 9, 2024, 2:10 PM IST
Chain Snatch at Ameenpur Rangareddy : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవ్యధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అమీన్పూర్లో రహదారిలో ఓ మహిళ బాలుడిని తీసుకుని నడుచుకుంటూ వెళుతుంది. వారికి ఆపోసిట్గా ఇద్దరు వ్యక్తులు బైక్పై వస్తూ ఆమె మెడలోని గొలుసును దొంగలించుకుని వెళ్లిపోయారు. అయితే వెనక్కి లాక్కోని వెళ్లడంతో ఆమె, బాలుడు ఇద్దరు కింద పడిపోయారు. దీంతో ఆ మహిళకు గాయలయ్యాయి.
అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇద్దరి నిందితులను పట్టుకోడానికి పరుగెత్తాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఐదు రోజుల క్రితం ఆర్కేనగర్కు చెందిన మహిళ తన భర్తతో కలిసి వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని దుండుగులు మెడలోని గొలుసును దొంగలించుకుని వెళ్లిపోయారు. దీంతో ఆ రహదారి వెంబడి మహిళలు వెళ్లాలంటే భయపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.