తెలంగాణ

telangana

ETV Bharat / videos

శ్రీకాకుళం జిల్లాలోనూ ఎయిర్​పోర్ట్ - కేంద్రమంత్రి రామ్మోహన్​ నాయుడు కీలక వ్యాఖ్యలు - Ram Mohan on Srikakulam Airport - RAM MOHAN ON SRIKAKULAM AIRPORT

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 10:49 AM IST

Central Minister Ram Mohan on Srikakulam Airport : ఏపీ అభివృద్ధి ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలోనే జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్​పోర్ట్​ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ మంజూరుకు కృషి చేస్తానని వివరించారు. ఇటీవల పాతపట్నంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

వెనుకబడిన ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి చేసేందుకు ఐటీఐ కళాశాలను మంజూరు చేయనున్నట్లు రామ్మోహన్​ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమంత్రి జన్​మన్​ వసతి గృహానికి మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. అలాగే పాతపట్నంలో ఉన్న సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవిందరావు, కలెక్టర్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details