గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం: సీఎస్ నీరబ్ కుమార్ - Amit Shah on Narcotics Control - AMIT SHAH ON NARCOTICS CONTROL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 9:22 PM IST
Amit Shah Video Conference on Narcotics Control: నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్‌పై దిల్లీ నుంచి హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ వివరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు చేయకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.
విద్యాసంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక నిఘా పెట్టి విద్యార్ధుల ప్రవర్తణలో మార్పునకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్ఆర్ భూముల్లో జీవనోపాధి పంటల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.