పవర్‌స్టార్ నివాసం వద్ద సందడి - అకిరాతో పవన్ కల్యాణ్ విక్టరీ సెలబ్రేషన్స్ - Celebrations In Pawan House - CELEBRATIONS IN PAWAN HOUSE
Published : Jun 4, 2024, 5:35 PM IST
Celebrating Moment in Pawan Kalyan Residence : ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి నేతలు విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు విజయం సాధించడంతో జనసేన, టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కూటమి విజయానికి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంబురాలతో హోరెత్తుతున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో గెలిచిన పవన్‌కు ఆయన సతీమణి లెజినోవా హారతి పట్టారు. ఆ పక్కనే అకిరానందన్ కూడా కనిపించాడు. పవన్‌ను చూసేందుకు ఆయన నివాసం వద్ద అభిమానులు, మహిళలు హారతులు పట్టనున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ నివాసానికి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున చేరుకుని సంబురాలు జరుపుకుంటున్నారు. బాణాసంచా కాల్చుతూ, కేరింతలు నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి అమరావతికి చేరుకున్నారు.