ఉరవకొండలో ఇంటింటికి వైఎస్సార్సీపీ స్టిక్కర్లు - నేతలపై పోలీసు కేసు నమోదు - Case Registered on YSRCP Leaders - CASE REGISTERED ON YSRCP LEADERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 10:59 AM IST
Uravakonda PS Case Filed On YSRCP Leaders: వైనాట్ 175 అంటూ కనిపించిన ప్రతి చోటా వైఎస్సార్సీపీ స్టిక్కర్లు (Stickers) అంటించుకుంటూ వెళ్తున్న అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై (Election Code Violation) పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇంటింటికీ వైఎస్సార్సీపీ (YSRCP) స్టిక్కర్లు అంటించిన అధికార పార్టీ నాయకులపై కేసు నమోదైంది.
Campaign of YSRCP MLA candidate Visweswara Reddy: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 11వ వార్డులో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటికీ వైఎస్సార్సీపీ స్టిక్కర్లు అంటించినట్లు ఈటీవీ - ఈనాడులో (ETV Eenadu Articles) కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్పీడీఓ (MPDO) అమృత్ రాజ్ ఉరవకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉరవకొండ పోలీసు స్టేషన్ లో పలువురు వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు.