ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు - Case Against YSRCP MLC Bharath - CASE AGAINST YSRCP MLC BHARATH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 4:09 PM IST

Case Against YSRCP MLC Bharath : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైెంది. తిరుమలలో తోమాల సేవ పేరిట ఆయన సిఫారసు లేఖ అమ్మినట్లు టీడీపీ నేత చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ సిఫారసు లేఖల అమ్మకంపై ఆయన గుంటూరు అరండల్​పేట పోలీస్​స్టేషన్‌లో ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు. భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు నమోదు చేసిన అరండల్​పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఎన్నికల్లో కుప్పం నుంచిచంద్రబాబుపై భరత్‌ పోటీ చేసి ఓడిపోయారు.

Case Filed MLC Bharath : కుప్పంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ భరత్ చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆయన ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఇప్పుడు తాజాగా భరత్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details