విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన కారు - తప్పిన పెను ప్రమాదం - car accident in Undrajavaram mandal
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 10:16 PM IST
Car Hit on Power Pole in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కాల్ధరి - వేలివెన్ను మధ్య కారులో ముగ్గురు యువకులు వెళ్తుండగా అదుపుతప్పి ఒక్కసారిగా విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభాని బలంగా ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
Car Accident in Undrajavaram Mandal : కారు విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అందులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జుగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి కారును అక్కడి నుంచి తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.