ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనెక్ట్‌ ఏపీ ఎక్స్‌పో - రెండు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కేబుల్‌ ఆపరేటర్లు - Cable Operators EXPO AP 2024 - CABLE OPERATORS EXPO AP 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:24 PM IST

Cable Operators Connect EXPO 2024 in Vijayawada : కేబుల్‌ ఆపరేటర్ల కోసం విజయవాడలోని ఏ వన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు విశేష స్పందన లభించింది. కేబుల్‌ ఆపరేటర్లకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కనెక్ట్‌ ఏపీ 2024 పేరిట నగరంలో ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేబుల్‌ ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేబుల్‌ రంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపరేటర్లకు అందించి లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా కేబుల్ వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

ప్రస్తుతం ఓటీటీ, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నందున వాటికి కేబుల్ టీవీ వ్యవస్థను అనుసంధానించి ఎక్కువ లాభాలు ఎలా పొందాలో తెలుపుతూ పలు సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. అధునాతన టెక్నాలజీ వినియోగంపై కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక సిబ్బందికి నిపుణులు అవగాహన కల్పించారు. కేబుల్​ సర్వీసులను తక్కువ ధరకే ఇచ్చే అవకాశాన్ని కల్పించాయి. ఈ ఎక్స్​పో తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని కేబుల్ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details