పులివెందులకు వచ్చిన జగన్‌ను ప్రాంత వాసులు నిలదీయాలి: బీటెక్ రవి - BTech Ravi on YS Jagan - BTECH RAVI ON YS JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 5:40 PM IST
BTech Ravi Comments on YS Jagan Coming to Pulivendula: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు వస్తున్న సందర్భంగా ఈ ప్రాంత వాసులు ఆయన్ని నిలదీయాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవి సూచించారు. రాష్ట్రంలో భారీగా తెలుగుదేశం పార్టీ గాలి వీసిన సందర్భంలో కూడా ఈ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని ఆ కృతజ్ఞతతో అయిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించే విధంగా జగన్‌ను నిలదీయాలని బీటెక్ రవి కోరారు. పులివెందుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పాడా నుంచి 700 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అనేకమంది గుత్తే దారులు పనులు చేశారని కానీ ఆ బిల్లులు చెల్లించకుండానే జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని గుర్తు చేశారు. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు నిధులు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రాంత వాసులకు ఎందుకు విడుదల చేయలేక పోయారని ప్రశ్నించారు. ఈరోజు పులివెందులకు వచ్చిన సందర్భంగా నిలదీయాలని బీటెక్ రవి గుర్తు చేశారు.