LIVE : సిరిసిల్లలో కేటీఆర్ ప్రెస్‌మీట్ - లైవ్ - KTR PRESS MEET LIVE - KTR PRESS MEET LIVE
Published : Sep 26, 2024, 3:12 PM IST
|Updated : Sep 26, 2024, 3:32 PM IST
KTR PRESS MEET LIVE : రెండు లక్షల రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితులున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ల మీదకు వచ్చి తలుపు తడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ల మీదకు బ్యాంకు అధికారులు వస్తున్నారని ఆక్షేపించారు. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ విలువ ఏంటని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామానికి వెళ్తే ఒక రైతన్న అయ్యో కేసీఆర్‌ను వద్దనుకుని తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రవిమర్శలు గుప్పించారు. రైతురుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు తదితర అంశాలపై ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Sep 26, 2024, 3:32 PM IST