LIVE : కల్వకుర్తిలో కేటీఆర్ రోడ్ షో - KTR Road Show Live - KTR ROAD SHOW LIVE
Published : May 8, 2024, 4:01 PM IST
|Updated : May 8, 2024, 4:33 PM IST
KTR Road Show in Kalwakurthy Live : రాష్ట్రంలో వేసవి వేడి కన్నా లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి అధికంగా ఉంది. ప్రధాన పార్టీల నేతలు నువ్వానేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవే ఆఖరి ఎన్నికలు అన్నట్లు అభ్యర్థులు తమతమ వ్యూహాలతో ముందుకు సాగిపోతున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కలిగిన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పార్లమెంటు ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఒకవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మరోవైపు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇంకొకవైపు హరీశ్‌రావు ఇలా ముగ్గురు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వారి ప్రచారంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని తేస్తున్నారు. 10 నుంచి 12 పార్లమెంటు సీట్లు గెలవాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తోంది. అందులో భాగంగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బస్సు యాత్రలు, రోడ్ షోల పేర్లతో నేరుగా జనాల్లోకి వెళుతున్నారు. తాజాగా కల్వకుర్తిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా కేటీఆర్ రోడ్ షో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తున్నారు.
Last Updated : May 8, 2024, 4:33 PM IST