తెలంగాణ

telangana

ETV Bharat / videos

మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు : మల్లారెడ్డి - Malla Reddy Election Campaign - MALLA REDDY ELECTION CAMPAIGN

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 12:37 PM IST

BRS Malla Reddy Election Campaign In Medchal : పార్లమెంట్​ ఎన్నికల్లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడ్చల్​ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన రోడ్ షో, కార్నర్​ మీటింగ్​లో పాల్గొన్న ఆయన, కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో రూ.50 కోట్లతో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోడ్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేసి మోడల్​ మున్సిపాలిటీగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు.

5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కరవు వచ్చిందని, వారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేటితో ప్రచార గడువు ముగియనుండటంతో బీఆర్​ఎస్ నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ హామీలు అమలు విఫలం కావడంతో వాటినే ఆయుధంగా చేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వారు ఇచ్చిన హమీలు అమలు కావాలంటే తమ పార్టీకి ఓటు వేసి అత్యధిక సీట్లు గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details