LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్ - బీఆర్ఎస్ లైవ్
Published : Feb 6, 2024, 3:58 PM IST
|Updated : Feb 6, 2024, 4:31 PM IST
BRS Leaders Meeting Live Today : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 3 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు ఆయన రావడంతో కేసీఆర్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండలో ఈనెల 13న బీఆర్ఎస్ బహిరంగ సభ ఉందని కేసీఆర్ తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు పార్టీ కార్యలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలను తెలియజేస్తున్నారు.