LIVE : తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియా సమావేశం - Harish Rao Press Meet LIVE - HARISH RAO PRESS MEET LIVE
Published : Sep 8, 2024, 12:13 PM IST
|Updated : Sep 8, 2024, 12:37 PM IST
BRS MLA Harish Rao Press Meet : ఎడతెరిపి లేని భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ వర్షాల దాటికి ఎంతో మంది ప్రజలు గూడును కోల్పోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మున్నేరు వరదకు మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఎంతో మంది కట్టుకున్న గుడ్డలతోనే మిగిలిపోయారు. నిత్యావసరాలు, బట్టలు వంటికి వరదలకు కొట్టుకుపోయాయి. పశువులు కొట్టుకుపోయాయి. వరదల అనంతరం, మున్నేరు శాంతించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయచర్యలను పర్యవేక్షించింది. ఈ క్రమంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, వరదలకు గురైన ప్రతి కుటుంబానికి రూ.10 వేల తక్షణ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలపై బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ముందు జాగ్రత్తగా ఎవరూ స్పందించలేదని పేర్కొంది. ఈ విషయంపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు.
Last Updated : Sep 8, 2024, 12:37 PM IST