LIVE : రామగుండంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో - ప్రత్యక్ష ప్రసారం - KCR Road Show In ramagundam - KCR ROAD SHOW IN RAMAGUNDAM
Published : May 3, 2024, 8:59 PM IST
|Updated : May 3, 2024, 9:33 PM IST
BRS Chief KCR Road Show In Ramagundam Live : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం ముగిసింది. దీంతో రామగుండంలో రోడ్‌షోతో మళ్లీ కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కారుపార్టీ అధినేత తమ ప్రచారాల్లో వేగం పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అధినేత. ఈ నేపథ్యంలోనే రామగుండంలో రోడ్‌షోను కేసీఆర్ మళ్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు రామగుండం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మిలాఖత్ అయ్యాయని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు అని కేసీఆర్ చెబుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారైనా కరెంటు, తాగునీటి సమస్య వచ్చిందా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనతోనే ప్రజలకు మళ్లీ మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరుతున్నారు.
Last Updated : May 3, 2024, 9:33 PM IST