LIVE : దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం - KISHAN REDDY LIVE - KISHAN REDDY LIVE
Published : Jun 6, 2024, 12:22 PM IST
|Updated : Jun 6, 2024, 12:40 PM IST
రాష్ట్రంలో ఇటీవల వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. 'భాజపాపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో భాజపాను గెలిపించారు. భాజపాకు తెలంగాణ ప్రజలు 35 శాతానికి పైగా ఓట్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మాత్రమే పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓటింగ్ మాత్రమే పెరిగింది. తెలంగాణలో చాలా చోట్ల భారాసకు డిపాజిట్లు కూడా రాలేదు. తెలంగాణ ప్రజలు భాజపాకు అండగా నిలబడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు భాజపాకు ఓటు వేశారు. మోదీ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా భాజపా గెలిచింది. గతంలో రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజిగిరిలో కూడా భాజపా గెలిపింది.' అంటూ ఆయన మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 6, 2024, 12:40 PM IST