ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్ ధైర్యంగా పులివెందులకు వెళ్లలేని పరిస్థితి: సత్యకుమార్ - BJP Satyakumar Allegations on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 7:31 PM IST

BJP Satyakumar Allegations on CM Jagan: రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన, వాల్మీకి యువజన సంఘం నాయకులు ఇంద్రావతి సురేంద్ర బీజేపీలో చేరిన సందర్భంగా ఉరవకొండ పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వై. సత్యకుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్, నేడు తన సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా ధైర్యంగా ఒక్కడే వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని తన గృహం నుంచి సచివాలయానికి కూడా హెలికాప్టర్​లోనే​ వెళ్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు లలిత్ కుమార్ నియోజకవర్గ ఇన్చార్జి కొనకొండ్ల రాజేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details