తెలంగాణ

telangana

ETV Bharat / videos

బండి సంజయ్​కు కేంద్రమంత్రి పదవి - శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీలు - BJP MPs CONGRATULATES BANDI SANJAY - BJP MPS CONGRATULATES BANDI SANJAY

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 2:02 PM IST

BJP MPs Wishes to Central Minister Bandi Sanjay  : కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు దిల్లీలో సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంఆర్​పీఎస్​ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కూడా సంజయ్‌ను కలిసి విషెస్ చెప్పారు. అనంతరం ఎంపీలు ఈటల రాజేందర్​, రఘనందన్​ రావులను బండి సంజయ్​ శాలువాతో సత్కరించారు. 

Bandi Sanjay Speech After Central Minister : తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్‌ ప్రజలకు బండి సంజయ్​ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. కేంద్రంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కరీంనగర్​ ఎంపీ స్థానం నుంచి బండి రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర పదవి దక్కించుకున్న బండి ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా కొనసాగుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details