తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రెస్​మీట్ - bjp mp etela rajender pressmeet - BJP MP ETELA RAJENDER PRESSMEET

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 3:17 PM IST

Updated : Jul 16, 2024, 3:40 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ నేత, మల్కాజ్​గిరీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించి ఇప్పుడు నిబంధనల పేరుతో కోత విధించడం సరికాదన్నారు. కేంద్రంలో నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇస్తున్నామని ఈటల గుర్తుచేశారు. మోదీ ప్రభు్తవం మద్దతు ధరలను రెట్టింపు చేసిందని, తెలిపారు. అడ్డదారులు తొక్కి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటిని అమలు చేసే సామర్థ్యం లేక రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలే రైతుకు ఉరితాడని ఆయన ఆరోపించారు. మోసం చేసే నాయకులను ప్రజలు నమ్ముతారు అని గతంలో సీఎం చెప్పారని కానీ తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, అవమానాన్ని భరించరని ఈటల గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయతీకి పట్టం కడతారని కితాబిచ్చారు.
Last Updated : Jul 16, 2024, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details