తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మీడియా సమావేశం - BJP MLA Alleti Live - BJP MLA ALLETI LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 12:13 PM IST

Updated : Jul 6, 2024, 12:19 PM IST

BJP MLA Alleti Maheshwar Reddy Press meet Live : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు శనివారం ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలు సైతం పలు సూచనలు చేస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దీనిపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఇప్పటికే బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​ తెలిపారు. తిరుమల పవిత్రత కాపాడాలని ఏపీ సీఎంకు లేఖ రాశామని చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని  ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కోరనున్నారు. 
Last Updated : Jul 6, 2024, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details