సిద్ధం సభలో పురందేశ్వరిపై సీఎం జగన్ వ్యాఖ్యలు - ఈసీకి బీజేపీ ఫిర్యాదు - BJP Complained to EC Against Jagan - BJP COMPLAINED TO EC AGAINST JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 4:33 PM IST
BJP Leaders Complained to EC Against CM Jagan: సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆ పార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. పురందేశ్వరి తరఫున మైనారిటీ మోర్చా షేక్ బాజీ, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధి మల్లిఖార్జునరావు లేఖను సీఈఓకు అందజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని షేక్ బాజీ అన్నారు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌పై సీబీఐ దర్యాప్తు జరుపుతోందని ఈ వ్యవహారంలో పురందేశ్వరికి అప్రతిష్ఠ కలిగేలే జగన్ మాట్లాడారని అందుకు తాము లీగల్ నోటీసు ఇచ్చామన్నారు. 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయడం జరిగిందన్నారు. సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన కంటైనర్ వీరయ్య చౌదరికి చెందినదిగా అధికారులు గుర్తించాన్నారు. వీరయ్య చౌదరి వైసీపీకి చెందిన వ్యక్తి కాదని సీఎం నిరూపించగలరా అని సవాల్ విసిరారు.
వినేవాడు అమాయకుడైతే అబద్ధాలను సమర్థవంతంగా చెప్పగలిగిన వ్యక్తి సీఎం జగన్. చిన్నాన్నను హత్య చేసిన వ్యక్తికి, చెల్లి ఆస్తి అడిగితే గొంతు పట్టుకొని గొడకేసి కొట్టే అన్నయ్యలకు రాజకీయాల్లో టిక్కెట్టు ఇస్తున్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పురందేశ్వరిపై జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఈవోకు నోటీసు ఇవ్వడం జరిగింది. -షేక్ బాజీ, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు