ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ పాలన అంతా భూకబ్జాలే - మూడు రాజధానుల పేరుతో దోపిడీ: లంకా దినకర్‌ - Lanka Dinkar on Land Titling Act - LANKA DINKAR ON LAND TITLING ACT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 5:02 PM IST

BJP Leader Lanka Dinakar Happy about Repeal of Land Titling Act: గుజరాత్‌ తరహాలో కొత్త ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్‌ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్​లో భూ మాఫియాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రక్షణకు చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ పాలన ఇష్టానుసారంగా భూ దందాలు జరిగాయని మండిపడ్డారు. అక్రమంగా తీసుకు వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తున్నట్లు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని లంకా దినకర్‌ తెలిపారు. చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించిన విధంగా అన్యాక్రాంత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్​సీపీ పాలన అంతా భూ కబ్జాదారుల పాలనగా సాగిందని దుయ్యబట్టారు. మూడు రాజధానులంటూ మభ్య పెట్టి మూడు ప్రాంతాలల్లోనూ అన్ని రకాల భూములను దోపిడీ చేశారన్నారు. అంతే కాకుండా గత ఐదేళ్లలో వేల ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని, సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details