దైవసన్నిధిలో వ్యక్తిగత కక్షలతో వ్యవహరిస్తున్నారు- టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ నేత ఆగ్రహం - BJP Bhanu on TTD EO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 5:37 PM IST
BJP Leader Bhanu Prakash TTD Ticket Alligation on EO: వ్యక్తిగత కక్షలతో తనకు దర్శన టికెట్టు జారీ చేయకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy) వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత భానుప్రకాశ్(BJP Leader Bhanu Prakash) మండిపడ్డారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్(Madhya Pradesh Former CM Shivraj Singh Chouhan) తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి భానుప్రకాష్ వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన భానుప్రకాష్ ఈవో అనుసరిస్తున్న విధానం సరికాదన్న అన్నారు. పాలకమండలి మాజీ సభ్యుడిగా టికెట్టు లేకుండా దర్శనానికి వెళ్లే హక్కు తనకుందని భానుప్రకాశ్ చెప్పారు.
"వ్యక్తిగత కక్షలతో టీటీడీ ఈవో వ్యవహరిస్తున్నారు. దర్శన టికెట్టు జారీ చేయకుండా ధర్మారెడ్డి హుకూం జారీచేశారు. పాలకమండలి మాజీ సభ్యుడిగా టికెట్టు లేకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే హక్కు నాకుంది." - భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ నేత