జగన్ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఆలస్యం: పురందేశ్వరి - BJP AP Chief Purandeswari - BJP AP CHIEF PURANDESWARI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 1:01 PM IST
BJP AP Chief Purandeswari Fired YSRCP : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకు 38 లక్షల మంది సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని తెలిపారు.
BJP Membership Registration in Visakha : ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సహకారం అందిస్తోందని చెప్పారు. మూడు దశల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేస్తున్నామనారు. అక్టోబర్ నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిస్తుందన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన బీజేపీ మాత్రమే అందిస్తోందని అన్నారు.