ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి- కాన్వాయ్​ను ఢీకొట్టిన బైక్​- యువకుడి పరిస్థితి విషమం - Bike Accident in Jagan Bus Yatra - BIKE ACCIDENT IN JAGAN BUS YATRA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 10:48 AM IST

Bike Accident in Jagan Bus Yatra in Eluru District : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న  మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామ సమీపంలో బస్సుయాత్రలోని వాహనశ్రేణి ఆకస్మికంగా నెమ్మదించింది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని కారును వెనక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు గుండు నరేశ్ ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు కారు వెనకాల అద్దం ముక్కలై ఆ యువకుడు అందులోకి చొచ్చుకెళ్లారు. 

Young Mans Condition is Critical : ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతడ్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమం (Critical) గా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందున్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ యువకుడు కైకరం గ్రామానికి చెందిన నరేశ్‌గా గుర్తించారు.  

ABOUT THE AUTHOR

...view details